హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్విమ్మర్ ప్రశాంత్‌కు MLA సన్మానం

WGL: 22వ మాస్టర్స్ నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన నల్లబెల్లి మండలం ముచ్చింపులకు చెందిన సింగరేణి ఉద్యోగి రాపర్తి ప్రశాంత్‌ను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సత్కరించారు. బెంగళూరులో జరగనున్న అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆయనకు అండగా ఉంటామని, భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.