హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెరామిక్స్ పరిశ్రమను సందర్శించిన విద్యార్థులు

TPT: ఏర్పేడు మండలం పల్లం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన 9, 10వ తరగతి విద్యార్థులు వృత్తి విద్యలో భాగంగా సుధా సోమానీ సెరామిక్స్ సంస్థను సందర్శించారు. టైల్స్ తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ విభాగాలపై అవగాహన పొందారు. పరిశ్రమలోని వివిధ కార్యకలాపాలు, తయారీ ప్రక్రియల గురించి కంపెనీ ప్రతినిధులు విద్యార్థులకు వివరించారు.