హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడివాడలో 'మీకోసం' కార్యక్రమం

కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ బాలాజీ శుక్రవారం గుడివాడ ఐఎంఏ హాల్‌లో 'మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రాబోయే మూడు శుక్రవారాలు కూడా నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.