హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కొండబాబు

కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శుక్రవారం జగన్నాధపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.