హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశా కార్యకర్తల శిక్షణ తరగతులు..!

W.G: శాస్త్రీయ దృక్పథంతోనే ప్రజారోగ్య సమస్యలకు సరైన పరిష్కారాలు లభిస్తాయని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రవి అన్నారు. భీమవరంలో నిర్వహించిన ఆశా వర్కర్ల జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఆశ వర్కర్ల నిరంతర సేవలతోనే శిశు, బాలింత మరణాలు తగ్గాయని కొనియాడారు. ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.