SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేట శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శుక్రవారం అనంత చతుర్దశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అనంతశయనుడికి ప్రత్యేక అభిషేకాలు, పూల అర్చనలు నిర్వహించారు. వేద పండితులు ప్రవీణ్ పూజారి దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్త దంపతులు అనంత కోటి వత్తుల యజ్ఞం, దీపోత్సవంలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయంలో అనంత చతుర్దశి వేడుకలు


