హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది: మాధవ్

సత్యసాయి: నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో భర్తీ చేసిన పోలీసు ఉద్యోగాల శిక్షణ పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పరేడ్‌లు నిర్వహిస్తుంటే, ఆ ఘనతను కూటమి నాయకులు తమ ఖాతాలో వేసుకోవడం సరైంది కాదన్నారు. నిరుద్యోగులపై కేసులు పెట్టడం సరికాదని హితవు పలికారు.