MLG: ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్‌ఎస్ ములుగు మండల ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో ఉండాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని, రాబోయే కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
తెలంగాణ
కష్టపడే కార్యకర్తలకు అండగా పార్టీ : బడే నాగజ్యోతి


