హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఎంపీ ఎమ్మెల్యే ఖేడ్ నియోజకవర్గంలో పర్యటన

SRD: ఖేడ్‌ నియోజకవర్గంలో శనివారం ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అనంతసాగర్‌లో రూ.50 లక్షలతో శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి, రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. 11 గంటలకు ఖేడ్‌లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కులను అందజేస్తారని నిర్వాహకులు నేడు తెలిపారు.