హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి'

JGL: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనంలో ఆహారం అందిస్తున్న నాణ్యత, రుచిని పరిశీలించారు. వంటశాల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని సూచించారు.