AKP: జిల్లాలో విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ అద్భుత ప్రతిభ కనబరిచిన మహిళా కానిస్టేబుల్ విజయను నక్కపల్లిలో హోంమంత్రి అనిత ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఆరు స్వర్ణ పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. అలాగే, ప్రజా సేవలో ముందుండే పోలీసు సిబ్బంది ప్రతిభను, సేవా స్ఫూర్తిని ప్రోత్సహించడం నా బాధ్యత అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా కానిస్టేబుల్‌కు హోంమంత్రి సత్కారం


