PPM: అర్జబ్ తుఫాన్ ప్రభావంతో సాలూరు పట్టణంలో ముంపునకు గురైన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే, సాలూరు నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రహదారులు, చెరువులు, పంట పొలాలు, నివాస గృహాల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన


