హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ZPP ప్రత్యేక అధికారిగా కలెక్టర్

ASR: జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి (ZPP-ASR)గా కలెక్టర్ నిశాంతి శుక్రవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. జిల్లా ప్రజా పరిషత్‌ల ఐదేళ్ల పదవీకాలం ముగిసినందున నూతన ప్రజాప్రతినిధులు బాధ్యతలు స్వీకరించేవరకూ జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమంపై ZPP దృష్టి పెడుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.