హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేట టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్

అన్నమయ్య: రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, పింఛన్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు. సమస్యలను విన్న చమర్తి, తక్షణ పరిష్కారం సాధ్యమైన అంశాలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.