హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంను కలిసిన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌

GNTR: అమరావతిలో సీఎం చంద్రబాబును గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌ అప్పారావు కలిశారు. యార్డులో చేపట్టిన అభివృద్ధి పనులు, రైతులకు అందిస్తున్న సేవలపై నివేదిక సమర్పించారు. మౌలిక వసతులు, పారదర్శక మార్కెటింగ్‌ కోసం తీసుకున్న చర్యలను వివరించారు. వచ్చే ఏడాది కార్యాచరణ ప్రణాళికను తెలిపారు. గుంటూరు మిర్చికి దేశ, విదేశీ మార్కెట్లలో గుర్తింపు పెంచుతామన్నారు.