ASR: పాడేరు శ్రీకృష్ణాపురం బాలికల పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంతి విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించారు. జిల్లాలో 1-19 ఏళ్ల పిల్లలందరికీ అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో మాత్రలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. నులిపురుగుల వల్ల పోషకాహార లోపం, రక్తహీనత, నీరసం, ఎదుగుదల లోపాలు వస్తాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నులిపురుగుల మాత్రలు వేయించిన కలెక్టర్


