హైదరాబాద్: 28°C
తెలంగాణ

హబ్సిగూడ గణనాథుడి సేవలో స్పీకర్

RR: హబ్సిగూడ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పూజలు చేశారు. అనంతరం మండపం నిర్వాహకులు సుమారు 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.