అన్నమయ్య: రాయచోటిలోని రెడ్డీస్ కాలనీలో వినాయకుడి లడ్డూ ప్రసాదం రికార్డు స్థాయిలో రూ. 2.12 లక్షలకు వేలం పలికింది. ఎల్లారెడ్డి ఝాన్సీ (చంద్రకళ) లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్యాండు, బాణాసంచా మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. గత ఏడాది లడ్డూ రూ.1.93 లక్షలకు వేలం పలికిందని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భారీ ధర వినాయకుడి లడ్డూ..!


