హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

సత్యసాయి: పుట్టపర్తిలో సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు సమస్యలపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సుమారు 400 గ్రామాలకు నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దెబ్బతిన్న పైపులు, విద్యుత్ సమస్యలను అధికారులు వివరించారు. అవసరమైతే సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు.