హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేడు జాతరతో బ్రహ్మోత్సవాలు ముగింపు

SRD: ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనంత చతుర్దశి సందర్భంగా 12వ రోజు సిద్ధి గణపతి వివిధ రకాల పుష్ప, ఫల అలంకరణతో భక్తులకు విశేష దర్శనం ఇచ్చారు. ఉదయం పంచామృత అభిషేకం, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.