హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరస్వతి ఎంటర్‌ప్రైజెస్‌లో మంటలు.. రూ.4 కోట్ల నష్టం

HNK: హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి జవహర్‌నగర్ క్రాస్ వద్ద భూక్య బద్రు నాయక్‌కు చెందిన సరస్వతి ఎంటర్‌ప్రైజెస్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి స్పార్క్‌లు రావడంతో ప్రమాదం జరిగిందని సుబేదారి సీఐ రంజిత్‌కుమార్ వెల్లడించారు.