హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోకాపేట చెరువు వద్ద సీపీ తనిఖీ

HYD: గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్, IPS నార్సింగి కోకాపేట చెరువును సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.