హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడు జడ్పీ కార్యాలయం ప్రారంభం

PLD: నరసరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కూడా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లాకు జడ్పీ కార్యాలయం నరసరావుపేటలో అందుబాటులోకి రావడంతో పరిపాలనా కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి.