హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

GDWL: ఖమ్మంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరగనున్న ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభల గోడపత్రికను మల్దకల్‌లో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కార్తీక్, PDSU నేత హాలింపాష ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 28న జరిగే బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.