హైదరాబాద్: 28°C
తెలంగాణ

రికార్డు స్థాయిలో లడ్డూ వేలం

నిజామాబాద్‌లోని ఏక చరేశ్వర శివాలయం సార్వజనిక్ గణేశ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో రాకాసిపేటకు చెందిన సాయి రాహుల్ రూ.5,11,000లకు లడ్డూను దక్కించుకున్నారు. సార్వజనిక్ గణేశ్ కమిటీ సభ్యులు సాయి రాహుల్‌కు లడ్డూను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.