VZM: గజపతినగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నూతన మద్యం షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జె.జనార్దన రావు తెలిపారు. గజపతినగరం మండలంలో ఒకటి, దత్తిరాజేరు మండలంలో రెండు షాపులకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా అక్టోబర్ 1వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానం


