AKP: రాంబిల్లి మండలం కొత్తపట్నంలో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి జి. దేవుడు డిమాండ్ చేశారు. 30 కుటుంబాల వారికి దగ్గర్లో విద్యుత్ స్తంభాలు లేవన్నారు. దూరంగా ఉన్న విద్యుత్ స్తంభాల నుంచి విద్యుత్ సరఫరా అవుతుందని తెలిపారు. గాలులు వర్షాలు పడితే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. దగ్గరలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి'


