హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికారాబాద్ రోడ్లకు భారీగా నిధులు: ఎమ్మెల్యే

VKB: నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి CRR గ్రాంట్ కింద రూ.40.60 కోట్ల అంచనా వ్యయంతో 32 పంచాయతీ రోడ్ల నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జీవో నంబర్ 494 విడుదల చేసింది. తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో నిధులు మంజూరైనట్లు తెలిపారు.