హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చింతలపల్లి, దామెర రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి'

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి చింతలపల్లి, దామెర గ్రామాలకు వెళ్లే రహదారులు వర్షాలకు బురదమయంగా మారి అధ్వానంగా తయారయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శుక్రవారం స్థానికులు తెలిపారు. రహదారులకు మరమ్మతులపై అధికారులు పట్టించుకోవడం లేదని, మంత్రి పొన్నం ప్రభాకార్ స్పందించి రోడ్డు పనులు పునరుద్ధరించాలని స్థానికులు కోరారు.