హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ మాజీ ఛైర్మన్‌కు సన్మానం

NTR: వత్సవాయి మండల జడ్పీటీసీ మాజీ ఛైర్మన్ ఏసుపోగు దేవమణి దంపతులను శుక్రవారం సన్మానించారు. వారి పదవీకాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సన్మానించారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు చేసిన కృషిని పలువురు ప్రశంసించారు. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని దేవమణి హామీ ఇచ్చారు.