విశాఖ నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ శుక్రవారం రికవరీ మేళా నిర్వహించారు. ఆగస్టు నెలలో 74 కేసులు ఛేదించి రూ.1,13,87,040 విలువైన సొత్తును బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 102 మందిని అరెస్ట్ చేసి, 796.065 గ్రాముల బంగారం, రూ.14,75,800 నగదు రికవరీ చేశామన్నారు. సొత్తు తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో రికవరీ మేళా నిర్వహణ


