హైదరాబాద్: 28°C
తెలంగాణ

భగత్‌సింగ్ జయంతి వారోత్సవాలను జయప్రదం చేయండి

BHNG: భగత్‌సింగ్ జయంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని పోచంపల్లి మండల ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ మండల కమిటీలు పిలుపునిచ్చాయి. శుక్రవారం దుబ్బాక జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి చుక్క రజినీకాంత్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఐలేష్ మాట్లాడుతూ..భగత్‌సింగ్ ఆశయాలను యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారోత్సవాల్లో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.