హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో రేపు '5కే రెడ్ రన్': కలెక్టర్

కోనసీమ: హెచ్‌ఐవీ/ఎయిడ్స్, లైంగిక సంక్రమిత వ్యాధులపై యువతలో అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 26న అమలాపురంలో ‘5కే రెడ్ రన్’ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. ఉదయం 6 గంటలకు భట్నవిల్లి హైవే వద్ద ప్రారంభమయ్యే ఈ పరుగులో 17–25 ఏళ్ల వయస్సు గల విద్యార్థులు, యువత పాల్గొనవచ్చు. విజేతలకు బహుమతులు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.