హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి'

SKLM: టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాద మృతుల కుటుంబాలను వైసీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్ శుక్రవారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన విద్యార్థి కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.40 వేలు సాయం అందజేశారు. మృతదేహాలను గ్రామాలకు చేర్చలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇదని విమర్శించారు. బాధితులకు రూ.25 లక్షల పరిహారం, పక్కా ఇళ్లు ఇవ్వాలన్నారు.