హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరిలో డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్లు

CTR: నగరి పురపాలక సంఘం పరిధిలోని 40 వార్డులకు సంబంధించిన డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల వార్డుల వారీ ముసాయిదా జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రజల పరిశీలనకు ఉంచారు. అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 26లోగా తెలియజేయాలని సూచించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.