హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికి 'ప్రజా దర్బార్'!

GNTR: ప్రజా సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రజా దర్బార్‌ వారధిగా నిలుస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.