హైదరాబాద్: 28°C
తెలంగాణ

'18 గంటల విద్యుత్ సరఫరా చేయాలి'

NLG: ఎండుతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం రోజుకు కనీసం 18 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం దేవరకొండ మండల కార్యదర్శి నల్ల వెంకటయ్య డిమాండ్ చేశారు. విద్యుత్ ఏడీఈ కార్యాలయం ముందు సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రైతులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులను కోరారు.