హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో కూలిన చెట్టు

VZM: తుఫాన్‌ ప్రభావంతో చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో భారీ చెట్టు కూలిపోయింది. దీంతో పాఠశాల కాంపౌండ్‌ వాల్‌ కుప్పకూలింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పరిస్థితిపై ఆరా తీశారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.