ASF: కౌటాల మండలం వీరవల్లికి చెందిన గర్భిణి అశ్వినికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవం జరిగింది. ఈఎంటీ అజయ్ చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా ప్రసవం చేయించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ
'అంబులెన్స్‌లో గర్భిణీకి ప్రసవం'


