హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్'

JN: ఈ నెల 26న జనగామ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయం, ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించి.. 12 మండలాలకు ప్రత్యేక గ్యాలరీలు, ప్రజలకు కుర్చీలు, బారికేడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.