ASR: అరకువేలి మండలం గిర్లిగూడ, డుంబ్రిగుడ మండలం పరశీల గ్రామాల మధ్య తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టు భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో ఉద్యోగులు, గ్రామస్తుల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి పనులు ఆలస్యం కావడానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎంపీటీసీ సభ్యుడు దశరథ్ శుక్రవారం ఆరోపించారు. కల్వర్టును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కల్వర్టును వెంటనే పునరుద్ధరించాలి'


