హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామంలో మద్యపాన నిషేధం'

MHBD: కొత్తగూడ మండలం కర్నగండి గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి స్వచ్ఛందంగా మద్యం విక్రయాలు, సేవనాన్ని సంపూర్ణంగా బంద్ చేయాలని శుక్రవారం ఏకగ్రీవంగా నిర్ణయించారు. ​గ్రామ అభివృద్ధి, కుటుంబాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా మహిళలు, యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు నడుం బిగించారు. ఈ నిర్ణయానికి స్థానిక పాలకులు సైతం మద్దతు తెలినట్లు గ్రామస్తులు వెల్లడించారు .