హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో పత్తి, మిర్చి ధరలు ఇలా..

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.8,775 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.25,000 ధర పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.30 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.21,500, టమాటా మిర్చి రూ.36 వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.