హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి

NLG: దేవరకొండ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు వస్కుల సుధాకర్ అధ్యక్షతన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ రాష్ట్ర కార్యదర్శి వనం పుష్పలత మాట్లాడుతూ..భారతీయ జనసంఘ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు.