హైదరాబాద్: 28°C
తెలంగాణ

​దీన్‌దయాల్ ఉపాధ్యాయకు మాజీ MP నివాళి

SRD:​ బీజేపీ ప్రాంత కార్యాలయంలో శ్రీ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బి.బి. పాటిల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ సిద్ధాంతాలకు, సమాజ సేవకు దీన్‌దయాల్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.