హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు నెలలుగా వీధిలైట్లు బంద్..!

KDP: సిద్ధవటంలోని ఎగువపేట బీసీ కాలనీలో మూడు నెలలుగా వీధిలైట్లు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ కాలనీ చీకటిమయంగా మారడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు బయటకు రావడానికి భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. పలుమార్లు అధికారులకు తెలిపినా సమస్య పరిష్కారం కాలేదని, వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.