హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలి'

BPT: దళితుల మరణాలపై నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని BSP బాపట్ల జిల్లా అధ్యక్షుడు గుదే రాజారావు కోరారు. శుక్రవారం బాపట్లలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 28న బాపట్ల కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. 27 మంది దళితుల మరణాలపై CBI విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దళిత ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.