హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం

JGL: మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నూతన గ్రానైట్ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రధాన ద్వారం ముందు పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్థమండపం, ప్రాకార మండపం, మహా మండపంలో దాదాపు 30 ఏళ్ల క్రితం వేసిన పాత బండలను తొలగించి కొత్తగా గ్రానైట్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా క్షేత్రపాలకుడు బేతాళస్వామి ఆలయం చుట్టూ సైతం గ్రానైట్ పనులు జరుగుతున్నాయి.