హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్

TPT: నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీకి టీడీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ పసుపు శాలువాతో స్వాగతం పలికారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.