హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటింటికి తిరిగి స్వచ్ఛతపై అవగాహన

SDPT: ధూలిమెట్ట మండలం లింగాపూర్ గ్రామపంచాయతీలో స్వచ్ఛత హి సేవ-2026 కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ప్రతి శుక్రవారం డ్రై డేస్ సందర్భంగా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని ప్రజలకు వివరించారు. చెత్తను నాలుగు విధాలుగా వేరుచేసి శానిటేషన్ సిబ్బందికి అందించాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్నారు.